భద్రతపై హామీ లేకుండా కాల్పుల విరమణ మాకు ప్రమాదకరం: జెలెన్ స్కీ
- రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం
- బైడెన్ సర్కారు విధానం వల్లే యుద్ధం ఇంకా కొనసాగుతోందన్న ట్రంప్
- ట్రంప్ వ్యాఖ్యలతో జెలెన్ స్కీ ఆగ్రహం... సమావేశం నుంచి నిష్క్రమించిన వైనం
- తాము కోరుకున్నంతగా శాంతిని ఎవరూ కోరుకోవడంలేదని జెలెన్ స్కీ తాజా వ్యాఖ్యలు
ఈ క్రమంలో జెలెన్ స్కీ తాజా వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నిలిచిపోవాలని ట్రంప్ కోరుకుంటున్నారు. మేం కోరుకున్నంత ఎక్కువగా ఎవరూ శాంతిని కోరుకోవడం లేదు. పుతిన్ తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడం కంటే వృథా పని ఇంకొకటి లేదు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పుతిన్ గత పదేళ్లలో పాతిక సార్లు ఉల్లంఘించాడు.
మరి మా భద్రతకు ట్రంప్ హామీ ఇస్తారా? భద్రతపై స్పష్టమైన హామీ లేకుండా కాల్పుల విరమణ మాకు ప్రమాదకరం. మనస్ఫూర్తిగా శాంతిని కోరుకోవడమే సమస్యలకు అసలైన పరిష్కారం. ఉక్రెయిన్ శాంతిని కోరుకుంటుందనే సందేశాన్ని బలంగా వినిపిస్తాం" అని జెలెన్ స్కీ వివరించారు.