పోసాని కృష్ణ‌ముర‌ళికి 14 రోజుల రిమాండ్‌

  • ఓబులవారిపల్లె పీఎస్‌లో 9 గంట‌ల పాటు విచార‌ణ‌
  • అనంత‌రం రైల్వేకోడూరు కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
  • రాత్రి 9.30 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు సుదీర్ఘంగా వాద‌న‌లు
  • పోసాని త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించిన పొన్న‌వోలు సుధాక‌ర్‌
సినీ న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళికి రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయ‌న‌ను క‌డ‌ప సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించే అవ‌కాశం ఉంది. గురువారం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో సుమారు 9 గంట‌లపాటు విచారించిన పోలీసులు రాత్రి జ‌డ్జి ముందు హాజరుపరిచారు. 

రాత్రి 9.30 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు సుదీర్ఘంగా వాద‌న‌లు కొన‌సాగాయి. పోసాని త‌ర‌ఫున పొన్న‌వోలు సుధాక‌ర్‌ రెడ్డి వాద‌న‌లు వినిపిస్తూ, ఆయ‌న‌కు బెయిల్ ఇవ్వాల‌ని కోరారు. అందుకు న్యాయ‌మూర్తి నిరాక‌రించారు. దీంతో పోసాని మార్చి 13 వ‌ర‌కు రిమాండ్‌లో ఉండ‌నున్నారు. కాగా, పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు బుధ‌వారం నాడు హైదరాబాద్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.


More Telugu News