ఉద్యోగులకు ఇన్ఫోసిస్ శుభవార్త... 20 శాతం వరకు వేతనాల పెంపు!
- ఉద్యోగులకు వేతనాల పెంపుకు సంబంధించి లేఖలు జారీ!
- అంచనాలు అందుకున్న వారికి 7 శాతం వరకు పెంపు
- అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి 20 శాతం వరకు పెంపు
- జనవరి 1వ తేదీ నుంచి వేతన పెంపు వర్తింపు
ఇన్ఫోసిస్ తన ఉద్యోగులను మూడు విభాగాలుగా వర్గీకరించింది. అంచనాలు అందుకున్న ఉద్యోగులకు 5 నుంచి 7 శాతం, అంచనాలకు మించి కనబరిచిన వారికి 7 నుంచి 10 శాతం, అత్యుతమ ప్రతిభ కనబరిచిన వారికి 10 నుంచి 20 శాతం వేతన పెంపును అందించినట్లుగా సమాచారం. జనవరి 1వ తేదీ నుంచి ఈ వేతన పెంపు వర్తిస్తుందని సమాచారం.