పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
- 19వ విడత నిధులను విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
- 9.7 కోట్ల మంది రైతులకు రూ.22 వేల కోట్లను విడుదల చేసిన కేంద్రం
- ఒక్కో రైతుకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.6 వేలు
బీహార్‌లోని భాగల్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో భాగంగా రూ.22 వేల కోట్లకు పైగా నిధులను విడుదల చేశారు. ఈ నిధులతో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. పీఎం కిసాన్ పథకం కింద ఒక్కో విడత రూ.2 వేల చొప్పున ఏడాదికి మూడు విడతలు మొత్తం రూ.6 వేలు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.