బీఆర్ఎస్‌లో చేరడం లేదు!: రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం కోనేరు కోనప్ప

Koneru Konappa says he will not join BRS
షార్ట్స్‌లో చూడండి
సిర్ఫూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ఆయన ముఖ్యమంత్రిని కలిశారు. అనంతరం ఆయన పార్టీ మార్పుపై వివరణ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బీఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు జరిగిన ప్రచారాన్ని ఖండించారు. తాను చివరి వరకూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని అన్నారు.

కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు నిన్న జోరుగా ప్రచారం సాగింది. అయితే, ఈరోజు ఆయన ముఖ్యమంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కోనేరు కోనప్ప 2014 ఎన్నికల్లో బీఎస్పీ నుండి పోటీ చేసి నాటి బీఆర్ఎస్ అభ్యర్థి కావేటి సమ్మయ్యపై విజయం సాధించారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో మరోసారి బీఆర్ఎస్ నుండి పోటీ చేసి గెలిచారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్ చేతిలో ఓడిపోయారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్‌లో చేరడంతో కోనేరు కోనప్ప అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Go Back to Shorts
Koneru Konappa
BRS
Congress
Telangana

More Telugu News