గ్రామ స్థాయి లీడర్ల భార్యల ఫోన్ నెంబర్లతో ఏం పని?: పేర్ని నాని
- కూటమి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తోందన్న పేర్ని నాని
- వైసీపీ నేతలు, కార్యకర్తల ఫోన్ నెంబర్లు సేకరిస్తున్నారని మండిపాటు
- చంద్రబాబు బంధువు ఈ పనులు చేస్తున్నారని ఆరోపణ
ఫోన్లు ట్యాప్ చేసి బెదిరించాలని చూస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు. తాము భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. విజయవాడ రమేశ్ ఆసుపత్రి వద్ద ఆఫీసు పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు బంధువైన ప్రకాశ్ అనే వ్యక్తి అనధికారికంగా ఈ పనులు చేస్తున్నాడని ఆరోపించారు. తప్పులు చేస్తున్న వాళ్లందరినీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు.