తెలంగాణలో భారీగా పెరిగిన వాహనాల సంఖ్య... వివరాలు ఇవిగో!
Advertisement

తెలంగాణలో భారీగా పెరిగిన వాహనాల సంఖ్య... వివరాలు ఇవిగో!

10 lakh new vehicles on the roads every year
  • తెలంగాణలో ప్రస్తుతం వాహనాల సంఖ్య 1.72 కోట్లు
  • రాష్ట్రం ఆవిర్భవించిన 2014 జూన్ 2 నాటికి వాహనాల సంఖ్య 71.52 లక్షలు
  • పదేళ్లలో రెండున్నర రెట్ల పెరుగుదల
తెలంగాణ రాష్ట్రంలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్రం ఆవిర్భవించిన 2014 జూన్ 2 నాటికి తెలంగాణలో 71.52 లక్షల వాహనాలు ఉండగా, పదేళ్లలో రెండున్నర రెట్లకు పెరిగింది. ఈ పదేళ్లలో కొత్తగా కోటి వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే పదేళ్లలో ఏటా సగటున పది లక్షల చొప్పున కొత్త వాహనాలు రోడ్లపైకి వచ్చినట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం వాహనాల సంఖ్య 1.72 కోట్లకు చేరింది. 
 
వాహనాల కొనుగోలుకు బ్యాంకులు, ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు విరివిగా రుణాలు ఇస్తున్నాయి. దీంతో చిరుద్యోగులు ఉద్యోగం రాగానే వెంటనే నెలసరి వాయిదాలపై వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. మధ్యతరగతి వర్గాలు కూడా ద్విచక్ర వాహనాలతో పాటు కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత జనాభాలో సగటున ఇద్దరిలో ఒకరికి వాహనం ఉన్నట్లు రవాణా శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. 

తెలంగాణలో అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే 82.45 లక్షల వాహనాలు ఉన్నాయి. అంటే దాదాపు 50 శాతం వాహనాలు ఈ మూడు జిల్లాల్లోనే ఉన్నాయి. అత్యల్పంగా ములుగు జిల్లాలో 53,430 వాహనాలు, ఆ తర్వాత భూపాలపల్లి జిల్లాలో 80,010, ఆసిఫాబాద్ జిల్లాలో 88,768 వాహనాల రిజిస్ట్రేషన్ అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

.  
Advertisement
New Vehicles
Telangana
Transport Department

More Telugu News