హమాస్ సంచలన ప్రకటన.. గాజాను వదులుకునేందుకు రెడీ!
- గాజాలోని అధికారాన్ని పాలస్తానాకు అప్పగించేందుకు హమాస్ అంగీకారం
- ఈజిప్ట్ ఒత్తిడితోపాటు ట్రంప్ విధానాలే ఈ నిర్ణయానికి కారణం
- 2007 నుంచి హమాస్ పాలనలోనే గాజా
పాలస్తీనా అథారిటీ( పీఏ) అనేది ప్రపంచం గుర్తించిన ప్రభుత్వం. 1993 ఓస్లో ఒప్పందం ప్రకారం ప్రస్తుతం వెస్ట్ బ్యాంక్‌ను ఇది పాలిస్తోంది. వెస్ట్‌బ్యాంక్, గాజా అనేవి రెండు పాలస్తీనా భూభాగాలు. 2007 నుంచి హమాస్ గాజాను పాలిస్తోంది. ఏడాదికిపైగా ఇజ్రాయెల్‌తో యుద్ధం చేస్తుండగా, ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉంది. ఈజిప్ట్ ఒత్తిడితో గాజాలోని అధికారాన్ని పాలస్తీనాకు అప్పగించేందుకు హమాస్ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు ‘స్కై న్యూస్ అరేబియా’ ఓ కథనంలో పేర్కొంది.