Revanth Reddy: రాబోయే మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలి: రేవంత్ రెడ్డి

వేసవి నేపథ్యంలో రాబోయే మూడు నెలల పాటు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు, ఇరిగేషన్ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వివిధ ప్రాజెక్టుల కింద సాగు అవుతున్న పంటలకు ప్రణాళిక ప్రకారం నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. సంబంధిత అధికారులతో సీఎం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.   

ఎండలు పెరిగే కొద్దీ తలెత్తే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి పరిస్థితులను పరిశీలించాలని... రైతులు ఇబ్బంది పడకుండా, పంటలు ఎండిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కృష్ణా జలాలను వినియోగించుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని... నిర్ణీత కోటా కంటే ఎక్కువ నీటిని ఏపీ తరలించకుండా అడ్డుకట్ట వేయాలని అన్నారు. దీనికి టెలిమెట్రీ విధానాన్ని అమలు చేయాలని సూచించారు.
Revanth Reddy
Congress
Telangana

More Telugu News