ఏపీలో పెరిగిన మద్యం ధరలు... నేటి నుంచే అమలు
- 15 శాతం ధరలు పెంచిన ఏపీ ప్రభుత్వం
- రూ.99కి విక్రయించే బ్రాండ్లు, బీరు మినహా మిగిలిన మద్యం రకాల ధర పెంపు
- ఉత్తర్వులు జారీ చేసిన ఎక్సైజ్ శాఖ
రాష్ట్రంలో మద్యం విక్రయాలపై మార్జిన్ ను ప్రభుత్వం ఇటీవలే 14.5 నుంచి 20 శాతానికి పెంచింది. ఇప్పుడు 15 శాతం ధరల పెంపుతో మందుబాబులకు షాకిచ్చింది. దేశీయ తయారీ ఫారెన్ లిక్కర్, ఫారెన్ లిక్కర్ కేటగిరీ మద్యంపై ఏఆర్ఈటీ (అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్) విధించనున్నారు.