గాజాపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్
- గాజాను స్వాధీనం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నామన్న ట్రంప్
- గాజాలోకి అమెరికా బలగాలను దింపుతామని వ్యాఖ్య
- పాలస్తీనియన్ల కోసం మంచి ఇళ్లు నిర్మిస్తామని హామీ
తాజాగా ట్రంప్ మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు. గాజాను స్వాధీనం చేసుకుంటామని ఉద్ఘాటించారు. ఇజ్రాయెల్, హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం అమలు చూస్తుంటే సహనం నశిస్తోందని అన్నారు. గాజాలోకి హమాస్ మళ్లీ అడుగుపెట్టకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. ప్రత్యామ్నాయం లేకే పాలస్తీనియన్లు శిథిలమైన గాజాలోకి రావాలనుకుంటున్నారని తెలిపారు.
గాజాలో ఉన్న పాలస్తీనియన్లను తొలుత మరో ప్రాంతానికి తరలిస్తామని... అనంతరం గాజాలోకి అమెరికా బలగాలను దింపి పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడతామని ట్రంప్ చెప్పారు. గాజాలో పాలస్తీనియన్ల కోసం మంచి ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. గాజాను స్వాధీనం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.