Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

షుగర్ ఉందా?​ జామ ఆకులు తింటే ఏమవుతుందో తెలుసా?

are guava leaves good for diabetics
Advertisement
  • మారిన జీవన శైలితో చాలా మందిలో షుగర్ వ్యాధి
  • దానిని నియంత్రణలో ఉంచుకునేందుకు ఎన్నో తిప్పలు
  • అలాంటి వారు జామ ఆకులను వినియోగిస్తే ప్రయోజనం ఉంటుందంటున్న ఆరోగ్య నిపుణులు
Advertisement
మారిన జీవన శైలితో ఇటీవలి కాలంలో చాలా మంది మధుమేహం బారినపడుతున్నారు. చిన్నవయసులోనే షుగర్ కారణంగా ఇబ్బందిపడుతున్నవారు కూడా ఎందరో. రక్తంలో షుగర్ స్థాయులను నియంత్రణలో ఉంచుకునేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారికి జామ ఆకులు ప్రయోజనకరంగా ఉంటాయని, రోజూ రెండు, మూడు ఆకులను నమిలి తినవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జామ ఆకులను ఆయుర్వేదంలోనూ ఉపయోగిస్తారని వివరిస్తున్నారు.

షుగర్ స్థాయుల నియంత్రణలో...
  • రోజూ కొన్ని జామ ఆకులను నమిలి తింటే... రక్తంలో షుగర్ స్థాయులు నియంత్రణలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరం కార్బోహైడ్రేట్లను వేగంగా సంగ్రహించకుండా జామ ఆకుల్లోని పదార్థాలు అడ్డుకుంటాయని వివరిస్తున్నారు.
  • జామ ఆకుల్లోని కొన్ని రకాల రసాయన పదార్థాలు మన శరీరం ఇన్సులిన్ కు స్పందించే తీరును మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల రక్తంలో షుగర్ స్థాయులు ఒక్కసారిగా పెరగడం, తగ్గడం వంటివి ఉండవని వివరిస్తున్నారు.
  • జామ ఆకుల్లో అధికంగా ఉండే ఫైబర్.. మన జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మధుమేహ బాధితులకు తరచూ ఏర్పడే కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తాయని సూచిస్తున్నారు.
  • శరీరానికి సమస్యలు తెచ్చిపెట్టే చెడు కొలెస్ట్రాల్ (ఎల్ డీఎల్)ను నియంత్రించడంలో జామ ఆకులు సమర్థవంతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇది గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలను తగ్గిస్తుందని, మధుమేహం ఉన్నవారికి ఇది ప్రయోజనకరమని పేర్కొంటున్నారు.

బరువు నియంత్రణకూ మేలు...
  • జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. ఇవి శరీరంలో ఇన్ ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి. మన శరీరంలో ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే పాంక్రియాస్ గ్రంథి దెబ్బతినకుండా కాపాడుతాయి. తద్వారా మధుమేహం సమస్యకు ఉపశమనం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
  • జామ ఆకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లకు తోడుగా విటమిన్ సి కూడా అధికమే. ఇది శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. మధుమేహ బాధితులు సులువుగా ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.
  • శరీరం బరువును నియంత్రణలో ఉంచుకోవాలనుకునేవారికి జామ ఆకులతో ఉపయోగం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. జామ ఆకులు శరీరంలో కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తాయని... ఇది మధుమేహంతో బాధపడుతున్నవారికి కూడా ప్రయోజనకరమని స్పష్టం చేస్తున్నారు.

పరిశోధనల్లో తేలిన మేరకే...
జామ ఆకుల ప్రయోజనాలను కేవలం మాటమాత్రంగా కాకుండా పరిశోధనల్లోనూ గుర్తించారు. అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) చేసిన ఓ అధ్యయనం ప్రకారం... మధుమేహ బాధితులకు జామ ఆకులతో చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయని తేలింది. షుగర్ స్థాయులను నియంత్రణలో ఉంచడం, ఇన్సులిన్ సెన్సిటివిటీ, గుండె జబ్బులు రాకుండా చూడటం వంటివి ముఖ్యమైనవని గుర్తించారు.
Advertisement
Advertisement
Health
guava
diabetes
offbeat
Viral News

More Telugu News