టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసులో విస్తుపోయే నిజాలు.. అమితాబ్, సల్మాన్ ఇళ్ల వద్ద కూడా రెక్కీ!
- అమితాబ్, సల్మాన్, అమీర్ సహా పలువురు స్టార్ల ఇళ్ల వద్ద రెక్కీ
- భద్రత తక్కువగా ఉన్న సెలబ్రిటీనే టార్గెట్‌గా చేసుకోవాలని ప్లాన్
- ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో టైగర్‌పై దాడికి యత్నం
- బాలీవుడ్ లో భయం సృష్టించడమే ప్రధాన ఉద్దేశం
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన కాల్పుల కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడికి ముందు నిందితులు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ సహా పలువురు టాప్ బాలీవుడ్ సెలబ్రిటీల నివాసాల వద్ద రెక్కీ నిర్వహించినట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ వర్గాలు వెల్లడించాయి. భద్రత తక్కువగా ఉన్న సెలబ్రిటీని లక్ష్యంగా చేసుకోవాలనేది వారి ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.
విచారణలో భాగంగా నిందితులు ముంబైలో తిరిగేందుకు ఆటో రిక్షాలను ఉపయోగించినట్లు తేలింది. తాము బాలీవుడ్ స్టార్ల అభిమానులమని, వారి ఇళ్లతో ఫొటోలు దిగాలని చెప్పి ఆటో డ్రైవర్లను నమ్మించారు. ఈ క్రమంలోనే అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ వంటి పలువురు తారల నివాసాల వద్ద రెక్కీ నిర్వహించారు.
ఈ సమయంలో ఒక ఆటో డ్రైవర్, నటుడు జాకీ ష్రాఫ్ కుమారుడైన టైగర్ ష్రాఫ్ ప్రతి ఆదివారం జుహూలోని ఫుట్‌బాల్ గ్రౌండ్‌కు వస్తాడని నిందితులకు సమాచారం ఇచ్చాడు. ఈ సమాచారంతో అక్టోబర్ 11న నిందితులు ఫుట్‌బాల్ గ్రౌండ్‌కు వెళ్లారు. కానీ ఆ రోజు టైగర్ అక్కడికి రాలేదు.
దీంతో మరుసటి ఆదివారం (అక్టోబర్ 18న) మళ్లీ ఆయుధాలతో అక్కడికి చేరుకుని టైగర్ కారుపై కాల్పులు జరిపారు. టైగర్‌కు పోలీస్ భద్రత లేదని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పెట్టే రీల్స్ ద్వారా తెలుసుకున్న నిందితులు, అతడిని సులభమైన లక్ష్యంగా ఎంచుకున్నట్లు ప్రాథమిక విచారణలో అంగీకరించారు.
దాడికి ఒక విదేశీ పిస్టల్, ఒక దేశవాళీ పిస్టల్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. దాడి అనంతరం ముంబై విడిచి వెళ్తూ ఆ రెండు ఆయుధాలను గుర్తుతెలియని ప్రదేశంలో పడేసినట్లు నిందితులు తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ దాడికి బాధ్యత వహిస్తూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ పరిశ్రమలో భయాన్ని సృష్టించడానికే ఈ దాడికి పాల్పడినట్లు నిందితులు వెల్లడించారు. ఈ ఘటనపై అమల్ మాలిక్, మికా సింగ్, విద్యుత్ జమ్వాల్, శత్రుఘ్న సిన్హా వంటి పలువురు సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు.