ఢిల్లీ ఫలితాల ట్రెండ్ పై కేటీఆర్ సెటైర్
- బీజేపీని మరోసారి గెలిపించారంటూ రాహుల్ గాంధీని ఎద్దేవా చేసిన బీఆర్ఎస్ నేత
- పాత వీడియోను పంచుకున్న కేటీఆర్.. వైరల్ గా మారిన ట్వీట్
- అంతకంతకు పెరుగుతున్న బీజేపీ ఆధిక్యం
మోదీని, బీజేపీని అడ్డుకోవడం రాహుల్ వల్ల కాదని తాను గతంలోనే చెప్పానంటూ కేటీఆర్ ఈ వీడియోను షేర్ చేశారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుతం బీజేపీ 42 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. అధికార పార్టీ ఆప్ 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రారంభంలో బాద్లీ నియోజకవర్గంలో లీడ్ లో ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం అక్కడ కూడా వెనుకంజలో ఉంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరవడంపై ఆ పార్టీ వర్గాల్లోనూ సందేహం నెలకొంది.