'ఠాగూర్' సినిమా చేజారడం బాధించింది: రాజశేఖర్

Rajasekhar regrets missing Tagore movie chance
  • 'ఠాగూర్' ఒరిజినల్ మూవీ విజయ్ కాంత్ నటించిన 'రమణ' చిత్రం
  • ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం గట్టిగా ప్రయత్నించిన రాజశేఖర్
  • చివరకు చిరంజీవి, వినాయక్ దర్శకత్వంలో 'ఠాగూర్'గా వచ్చిన చిత్రం

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఠాగూర్' చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై యాంగ్రీ హీరో రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఈ సినిమా రాజశేఖర్ చేయాల్సిందట. తమిళంలో విజయ్ కాంత్ నటించిన 'రమణ' చిత్రం చూడగానే, ఆ కథ రాజశేఖర్‌ కు బాగా నచ్చింది. ఆ రీమేక్ హక్కులను తానే సొంతం చేసుకోవాలని గట్టిగా ప్రయత్నించారట.


కొన్ని రాజకీయ, వ్యాపార కారణాల వల్ల ఆ కథ చిరంజీవి, నిర్మాత మధు వద్దకు వెళ్ళింది. చివరకు వినాయక్ దర్శకత్వంలో అది 'ఠాగూర్'గా మారి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. దీనిపై రాజశేఖర్ మాట్లాడుతూ... "ఆ సినిమా నేను చేసి ఉంటే నా కెరీర్ మరోలా ఉండేది. అవకాశం చేజారడం అప్పట్లో బాధ కలిగించినా, చిరంజీవి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు" అని భావోద్వేగానికి లోనయ్యారు.
Go Back to Shorts
Rajasekhar
Tagore movie
Chiranjeevi
Vinayak
Ramana remake
Telugu cinema
Madhu producer
Vijayakanth
Telugu movies

More Telugu News