Payyavula Keshav: జగన్ కు మతి భ్రమించింది: పయ్యావుల కేశవ్

వైసీపీ అధినేత జగన్ పై ఏపీ ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 30 ఏళ్లు తానే సీఎం అని జగన్ కలలు కనడంలో తప్పు లేదని... అయితే ఆ కలలను నిజం అనుకోవడంలోనే ఇబ్బంది ఉందని అన్నారు. జగన్ ఆ మాత్రం కలలు కనకపోతే... ఆయనకు, ఆయన కేడర్ కు నిద్ర పట్టదని ఎద్దేవా చేశారు. జగన్ కు మతి భ్రమించిందని అన్నారు. 

కేడర్ లో నమ్మకం నింపడానికి, మనసుకు సర్ది చెప్పుకోవడానికి జగన్ ప్రయాస పడుతున్నారని కేశవ్ అన్నారు. అసెంబ్లీని ఎదుర్కొనే ధైర్యం లేకే ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ కలలు కల్లలుగానే మిగిలిపోతాయని చెప్పారు.
Payyavula Keshav
Telugudesam
Jagan
YSRCP

More Telugu News