Virat Kohli: ఆర్సీబీలో 5వ ఓవర్సీస్ ప్లేయర్ మీరేనా?.. సోషల్ మీడియా జోక్‌పై కోహ్లీ ఫన్నీ రియాక్షన్!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ ఆటగాడు, కింగ్ కోహ్లీగా అభిమానులు పిలుచుకునే విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాడు. మైదానంలో ఉన్నా, లేకపోయినా అతడి గురించి ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఐపీఎల్‌లో అద్భుతంగా రాణిస్తున్న కోహ్లీ.. తనపై పేలుతున్న ఓ సరదా జోక్‌కు నవ్వుతూ సమాధానమిచ్చి మరోసారి వార్తల్లో నిలిచాడు.
ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లను మాత్రమే ఆడించే వీలుంది. అయితే, కోహ్లీ తన భార్య అనుష్క శర్మ, పిల్లలతో కలిసి ఎక్కువ సమయం లండన్‌లో గడుపుతుండటంతో.. అతడిని ఆర్సీబీ తరఫున ఆడుతున్న ఐదో 'ఓవర్సీస్ ప్లేయర్' అంటూ సోషల్ మీడియాలో అభిమానులు సరదాగా జోకులు వేస్తున్నారు. ఈ విషయంపై ఆర్సీబీ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో మిస్టర్ నాగ్స్, కోహ్లీని ప్రశ్నించాడు.
"ఈ సీజన్‌లో ఆర్సీబీ ఐదుగురు ఓవర్సీస్ ప్లేయర్లతో ఆడుతోందనే జోక్‌పై మీరేమంటారు?" అని మిస్టర్ నాగ్స్ అడగ్గా.. కోహ్లీ ఒక్కసారిగా నవ్వేశాడు. "నన్ను ఎందుకు అడుగుతున్నారు? ఆ విషయం ఓవర్సీస్ ప్లేయర్లను అడగండి. నేను ఓవర్సీస్ ప్లేయర్‌ని కాదు" అని ఫన్నీగా బదులిచ్చాడు. ఆ తర్వాత, "నేను ఓవర్సీస్ ప్లేయర్‌లా కనిపిస్తున్నానా?" అని ఎదురు ప్రశ్నించగా, లేదని హోస్ట్ సమాధానమిచ్చాడు. ఈ సరదా సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.