కేటీఆర్, హరీశ్ రావు నా కాలిగోటికి కూడా సరిపోరు: కోమటిరెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేటీఆర్, హరీశ్ రావు నా కాలిగోటికి కూడా సరిపోరు: కోమటిరెడ్డి

Komati Reddy comments on KTR and Harish Rao
  • కేటీఆర్ ఒక పనికిమాలిన వ్యక్తి అన్న కోమటిరెడ్డి
  • ప్రతిపక్ష నేత పదవి కోసం కేటీఆర్, హరీశ్ రావు కొట్టుకుంటున్నారని విమర్శ 
  • కేసీఆర్ మాదిరి తాను ఎలెక్షన్, కలెక్షన్ చేయలేదని వ్యాఖ్య
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్, హరీశ్ రావు తన కాలిగోటికి కూడా సరిపోరని అన్నారు. కేటీఆర్ ఒక పనికిమాలిన వ్యక్తి అని... పనికిరాని మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు. కేటీఆర్ పై ఉన్న అవినీతి ఆరోపణలు తనపై లేవని అన్నారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, తనపై ఒక్క అవినీతి మరక కూడా లేదని చెప్పారు. కాంగ్రెస్ సభల్లో పల్లీలు, ఐస్ క్రీమ్ లు అమ్ముకునేంత మంది కూడా కేటీఆర్ సభకు రారని ఎద్దేవా చేశారు. 

ప్రతిపక్ష నేత పదవి కోసం కేటీఆర్, హరీశ్ రావు కొట్టుకుంటున్నారని కోమటి రెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర చేసి, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. కేసీఆర్ మాదిరి తాను ఎలెక్షన్, కలెక్షన్ చేయలేదని అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వస్తారో, రారో? చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఉన్నారా... లేక, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉన్నారా? అని ప్రశ్నించారు. గద్దర్ కు అవార్డ్ ఇస్తే తప్పేముందని అన్నారు.
Advertisement
Komatireddy Venkat Reddy
Congress
KTR
Harish Rao
KCR
BRS

More Telugu News