'హరిహర వీరమల్లు' నుంచి అదిరిపోయే అప్డేట్.. కొత్త పోస్టర్ విడుదల
- పవన్ కల్యాణ్, జ్యోతికృష్ణ కాంబోలో 'హరిహర వీరమల్లు'
- ఈరోజు బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ పుట్టినరోజు
- ఈ సందర్భంగా ఆయన తాలూకు పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్
అయితే మేకర్స్ సోమవారం సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ పుట్టినరోజు సందర్భంగా, ఆయనకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్‌లో బాబీ చూడగానే ఆకట్టుకునేలా కత్తిపట్టుకుని గంభీరంగా కనిపిస్తున్నారు.
కాగా, ఈ చిత్రం నుంచి ఇటీవలే పవర్‌స్టార్ స్వయంగా ఆలపించిన 'మాట వినాలి' అంటూ సాగే పాటను విడుదల చేశారు మేకర్స్. ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీలో పవన్ సరసన కథానాయికగా నిధి అగర్వాల్ నటిస్తున్నారు.