జగన్ రెడ్డి, విజయసాయి కలిసి ఆడుతున్న డ్రామా ఇది: బుద్దా
- ఎక్స్ వేదికగా విజయసాయిపై మండిపడ్డ బుద్దా వెంకన్న
- చంద్రబాబుతో విభేదాలు లేవంటే ప్రజలు నమ్మేంత పిచ్చోళ్లు కాదన్న బుద్దా
- కేసులు పక్కదారి పట్టించడానికి ఆడుతున్న నాటకంగా అభివర్ణించిన బుద్దా
చంద్రబాబుతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవు అని విజయసాయి అంటే నమ్మేంత పిచ్చోళ్లు ప్రజలు కాదని అన్నారు. చంద్రబాబును విజయసాయి అన్న ప్రతి మాట తమకు ఇంకా గుర్తుందని అన్నారు. చేసినవి అన్నీ చేసి ఈ రోజు రాజీనామా చేసి వెళ్లిపోతా అంటే కుదరదన్నారు. మీరు చేసిన భూకబ్జాలు, దోపిడీలు ఉత్తరాంధ్రలో నువ్వు చేసిన అరాచకాలు ప్రతి దానికి లెక్క తేలాలన్నారు. విజయసాయిరెడ్డికి దేశం విడిచి వెళ్లడానికి సీబీఐ అనుమతి ఇవ్వకూడదని బుద్దా విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబుని, ఆయన కుటుంబ సభ్యులను విజయసాయిరెడ్డి అన్న మాటలు ఎవరు మర్చిపోయినా నేను మరచిపోనని బుద్దా వెంకన్న అన్నారు. విజయసాయి ఎన్ని నాటకాలు ఆడినా ఎవరు క్షమించినా తాను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.