ఢిల్లీ నుంచి విజయవాడ బయల్దేరిన సీఎం చంద్రబాబు
- దావోస్ నుంచి గత రాత్రి ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు
- నేడు ఢిల్లీలో నిర్మలా సీతారామన్, రామ్ నాథ్ కోవింద్ లతో భేటీ
- స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజి ఇవ్వడం పట్ల నిర్మలా సీతారామన్ కు కృతజ్ఞతలు
కాగా, దావోస్ లో సీఎం చంద్రబాబు పర్యటన నాలుగు రోజుల పాటు సాగింది. దిగ్గజ సంస్థల సీఈవోలు, చైర్మన్లతో భేటీ అయిన చంద్రబాబు... ఏపీకి భారీ పెట్టుబడులు రాబట్టడంలో సఫలమయ్యారని టీడీపీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
అటు, మంత్రి లోకేశ్ ఇవాళ దావోస్ నుంచి తిరుగుపయనమయ్యారు.