ట్రంప్ ప్రమాణ స్వీకారం.. అమెరికాలో పెట్టెబేడా సర్దుకుంటున్న అక్రమ ప్రవాసులు!
- ప్రవాసులకు స్వర్గధామంగా షికాగో
- ఈ వారంలో అక్కడి చొరబాటుదారులపై చర్యలు ఉంటాయని వార్త
- తమ పిల్లల్ని సంరక్షకులకు అప్పగిస్తున్న ప్రవాసులు
- దేశాన్ని వీడేందుకు ఏర్పాట్లు
ప్రవాసులకు స్వర్గధామమైన షికాగోలో చొరబాటుదారులపై ఈ వారం చర్యలు తీసుకోబోతున్నారన్న వార్త అక్కడి ప్రవాసుల్లో కలకలం రేపింది. పలువురు ప్రవాసులు షికాగోలో ఇళ్లు కొనుక్కుని స్థిరపడ్డారు. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటన్న దానిపై ఆందోళన నెలకొంది. మరోవైపు, దేశంలో అక్రమంగా ఉంటున్న ప్రవాసులపై చర్యలు తప్పవని ట్రంప్ మద్దతుదారులు కూడా హెచ్చరిస్తున్నారు.