454 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

Markets ends in profits
  • లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
  • 141 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 9.15 శాతం పెరిగిన కోటక్ మహీంద్రా బ్యాంక్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో పాటు బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 454 పాయింట్ల లాభంతో 77,073కి పెరిగింది. నిఫ్టీ 141 పాయింట్లు పుంజుకుని 23,344 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 5 పైసలు బలపడి రూ. 86.55 వద్ద కొనసాగుతోంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
కొటక్ మహీంద్రా బ్యాంక్ (9.15%), బజాజ్ ఫైనాన్స్ (3.58%), బజాజ్ ఫిన్ సర్వ్ (3.18%), ఎన్టీపీసీ (2.96%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.96%). 

టాప్ లూజర్స్:
జొమాటో (-3.14%), అదానీ పోర్ట్స్ (-1.23%), టీసీఎస్ (-1.18%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.99%), మారుతి (-0.80%).
Go Back to Shorts
Stock Market
Sensex
Nifty

More Telugu News