అక్షయ తృతీయ ధన్ ధనా ధన్.. రూ. 20,000 కోట్ల వ్యాపారం!
- గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు
- భారీ నగలకు బదులు తక్కువ బరువున్న ఆభరణాలకే ప్రాధాన్యం
- విలువ పరంగా అమ్మకాలు పెరిగినా పరిమాణంలో తగ్గుదల
- డిజిటల్ గోల్డ్, గోల్డ్ బాండ్ల వైపు పెరుగుతున్న ఆసక్తి
గతేడాది 10 గ్రాముల బంగారం ధర సుమారు లక్ష రూపాయలు ఉండగా, ప్రస్తుతం అది రూ. 1.58 లక్షలకు చేరింది. వెండి ధర కూడా కిలోకు రూ. 85,000 నుంచి ఏకంగా రూ. 2.55 లక్షలకు ఎగబాకింది. ఈ భారీ ధరల పెరుగుదల వినియోగదారుల కొనుగోలు సరళిపై స్పష్టమైన ప్రభావాన్ని చూపింది. ప్రజలు భారీ ఆభరణాలకు బదులుగా తక్కువ బరువున్న (లైట్‌వెయిట్), నిత్యం ధరించేందుకు వీలైన నగల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
ధరలు పెరగడంతో వ్యాపారం విలువ పరంగా పెరిగినట్లు కనిపిస్తున్నా, విక్రయించిన బంగారం పరిమాణం (వాల్యూమ్) తగ్గిందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈసారి దేశవ్యాప్తంగా సుమారు 10 టన్నుల బంగారం, 157 టన్నుల వెండి అమ్ముడవుతాయని అంచనా. మరోవైపు, భౌతిక బంగారానికి బదులుగా డిజిటల్ గోల్డ్, సావరిన్ గోల్డ్ బాండ్ల (SGB) వైపు కూడా ప్రజలు, ముఖ్యంగా యువత ఆసక్తి కనబరుస్తున్నారు.