అన్నదానంలో భాగస్వాములు కండి.. స్ఫూర్తిగా నిలిచిన భువనేశ్వరి: చంద్రబాబు
- విజయవాడ అన్న క్యాంటీన్‌లో అల్పాహారం చేసిన సీఎం చంద్రబాబు
- రూ.5కే పేదలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని వెల్లడి
- అన్న క్యాంటీన్ల నిర్వహణకు ప్రజలు విరాళాలివ్వాలని పిలుపు
- గత ప్రభుత్వం క్యాంటీన్లు మూసేయడంపై తీవ్ర విమర్శలు
- అన్నపూర్ణ ఏపీలో ఆకలి కేకలు ఉండొద్దన్నదే లక్ష్యమన్న సీఎం
సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం విజయవాడ పటమటలోని అన్న క్యాంటీన్‌లో అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా అక్కడి ఆహార నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పేదలు గౌరవంగా, కడుపునిండా భోజనం చేసేందుకే అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించామని, కేవలం రూ.5లకే నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లు పనిచేస్తుండగా, ఇటీవల 62 కొత్త క్యాంటీన్లను ప్రారంభించామని, మరో 5 సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇస్కాన్ ఫౌండేషన్ సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారని ప్రశంసించారు. బయట భోజనానికి రూ.100 ఖర్చయ్యే చోట, పేదలు, ఆటో డ్రైవర్లు, కార్మికులు రూ.5కే ఇక్కడ భోజనం చేస్తున్నారని అన్నారు.
అన్నదానం ఎంతో పవిత్రమైందని, ఈ మహాయజ్ఞంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తన పుట్టినరోజు సందర్భంగా శ్రీమతి భువనేశ్వరి రూ.76 లక్షలు విరాళంగా ఇచ్చి స్ఫూర్తిగా నిలిచారని, ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. ఇది ప్రజా ఉద్యమంలా మారాలని, ఎవరినీ బలవంతం చేయడం లేదని, తోచిన విధంగా విరాళాలు అందించి పేదల ఆకలి తీర్చడంలో పాలుపంచుకోవాలని కోరారు.
గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసివేయడాన్ని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. పేదలు కడుపునిండా అన్నం తింటే ఓర్వలేని వారు రాష్ట్రాన్ని పాలించారని, భోజనం పెడతామన్న వారిపై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. "అన్నపూర్ణ"గా పేరున్న ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. క్యాంటీన్లలో పేదల ముఖాల్లో కనిపిస్తున్న ఆనందం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు.