కటింగులు, కటాఫ్ లు మినహా ఏడాది కాంగ్రెస్ పాలనలో ఒరిగిందేమిటి?: కేటీఆర్
- రుణమాఫీ, రైతు భరోసా కటింగ్ అన్న కేటీఆర్
- రూ. 3 లక్షల వడ్డీ లేని రుణాలు కటింగ్ అని విమర్శ
- ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలం కటింగ్ అన్న కేటీఆర్
నిరుద్యోగుల కోసం యూత్ కమిషన్ రూ. 10 లక్షలు వడ్డీ లేని రుణం కటింగ్, నిరుద్యోగ యువతకు నెలకు రూ. 4 వేల నిరుద్యోగ భృతి కటింగ్, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ. 12 లక్షల ఆర్థిక సాయం కటింగ్, ఆశా కార్యకర్తలకు రూ. 18 వేల వేతనం కటింగ్, మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం రూ. 10 వేలకు పెంపు కటింగ్, 50 ఏళ్లు పైబడిన జానపద కళాకారులకు రూ. 3 వేల పెన్షన్ కటింగ్, రేషన్ డీలర్లకు రూ. 5 వేల గౌరవ వేతనం మరియు కమీషన్ కటింగ్, ఆర్టీసీ విలీన ప్రక్రియ కటింగ్, ప్రతి ఆటో డ్రైవర్ కు ఏడాదికి రూ. 12 వేలు కటింగ్, విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్ కటింగ్, కౌలు రైతులకు ఎకరాకు ఏడాదికి రూ. 15 వేలు కటింగ్ అని విమర్శించారు.
200 యూనిట్ల ఉచిత కరెంటు కటాఫ్, రూ. 500 గ్యాస్ సిలిండర్ కటాఫ్, రైతు కూలీలకు ఏడాదికి రూ. 12 వేలు కటాఫ్, ఆఖరుకు ఇందిరమ్మ ఇళ్లకు కటాఫ్ అని కేటీఆర్ అన్నారు. పేదలకు ఇచ్చే ఇందిరమ్మ ఇళ్లకు కటాఫ్ ఎందుకని ప్రశ్నించారు. అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇల్లు కట్టించి ఎందుకు ఇవ్వరని అడిగారు.