పుష్ప-2 రీలోడెడ్‌లో యాడ్‌ అయిన కొత్త సీన్లు ఇవే...!

These are the new scenes added in Pushpa2 Reloaded
  • 'పుష్ప-2' లో ఈ నెల 17నుంచి అదనంగా 20 నిమిషాలు 
  • ఇప్పుడు 'పుష్ప-2' నిడివి 3 గంటల 40 నిమిషాలు 
  • రీ లోడెడ్‌ వెర్షన్ కు సూపర్‌ రెస్పాన్స్‌
అల్లు అర్జున్‌-సుకుమార్‌ కలయికలో వచ్చిన 'పుష్ప-2: ది రూల్‌' సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్‌ ఫిల్మ్‌గా 'పుష్ప-2' సరికొత్త రికార్డును సాధించింది. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అనూహ్య రెస్పాన్స్‌తో రెండు వేల కోట్ల వసూళ్లకు చేరువలో ఉంది. 

కాగా ఈ చిత్రం నిడివికి అదనంగా మరో 20 నిమిషాల కొత్త సన్నివేశాలు జోడించారు మేకర్స్‌. ఈ నెల 17 నుంచి థియేటర్స్‌లో 'పుష్ప' రీలోడెడ్‌ వెర్షన్‌ను ప్రదర్శిస్తున్నారు. ఈ రీ లోడెడ్‌ వెర్షన్‌కు కూడా మంచి స్పందన వస్తోంది. రీ లోడెడ్‌ వెర్షన్‌ హౌస్‌ఫుల్స్‌తో ప్రదర్శింపబడుతోంది. 

సినిమా విడుదలై 40 రోజులు దాటుతున్నా ఇంకా పుష్ప-2 హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుండటం ట్రేడ్‌ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. కాగా ఈ చిత్రంలో అదనంగా యాడ్ చేసిన కొత్త సన్నివేశాలు ఇవే... 

1)  ఎర్రచందనం చెన్నై బోర్డర్‌కు తరలించిన తరువాత షెకావత్‌ ( ఫహాద్‌), పుష్పరాజ్‌ మధ్య వచ్చే సన్నివేశంలో అదనంగా మంగళం శ్రీను, (సునీల్‌) దాక్షాయణి (అనసూయ)లు చెప్పే సంభాషణలు యాడ్‌ చేశారు 

2) జాతర సన్నివేశంలో కావేరికి ( కావ్య) శ్రీవల్లి (రష్మిక మందన్నా)కు మధ్య కొన్ని సంభాషణలు 

3) ఎర్రచందనం అనుకుని సండ్రను పట్టుకున్న షెకావత్‌ వద్దకు అది ఎర్రచందనం అని తేల్చే కమిటి రావడం 

4) పుష్పరాజ్‌తో సిండికేట్‌ మీటింగ్‌... ఈ సన్నివేశంలో పుష్పరాజ్‌కు పవర్‌ఫుల్‌ డైలాగులు ఉంటాయి. పుష్పగాడు ఇది ఎర్రచొక్కా అంటే అందరూ ఎర్రచొక్కా అని నమ్మాలి... అనే డైలాగ్‌ ఈ మీటింగ్‌ సన్నివేశంలోనే ఉంటుంది. 

5) రామేశ్వరంలో అండర్‌ వాటర్ లో బోట్‌ల కింద ఎర్రచందనం శ్రీలంకకు పంపే సన్నివేశానికి ముందు యాక్సిడెంట్‌లో జపాన్‌ డీలర్‌ హామీద్‌, జక్కారెడ్డి చనిపోయే సన్నివేశం... హామీద్‌ను షెకావత్‌ చంపే సన్నివేశం 

6) అల్లు అర్జున్‌ జపాన్‌ ఎపిసోడ్‌... సినిమాలో ఇంట్రడక్షన్‌ సీన్‌కు ఇది లింకై ఉంటుంది. రీలోడెడ్‌లో ఈ జపాన్‌ సన్నివేశాలు హైలైట్‌గా ఉంటాయి. 

7) జాలిరెడ్డి ఇంటికెళ్లి పుష్పరాజ్‌... జాలిరెడ్డితో మాట్లాడటం
 
8) క్లైమాక్స్‌లో చిన్నప్పుడు పుష్పరాజ్‌ దగ్గర అజయ్‌ లాక్కున చైన్‌ను కావేరి పెళ్లిలో అజయ్‌, పుష్పరాజ్‌ మెడలో వేయడం

 ఇలాంటి సన్నివేశాలతో పుష్ప-2 రీలోడెడ్‌ వెర్షన్ అత్యంత రక్తికట్టించింది. రీలోడెడ్‌ తరువాత ప్రేక్షకుల్లో ఉన్న చిన్న చిన్న కన్‌ఫ్యూజన్స్‌ విషయంలో అందరికి క్లారిటీ వచ్చేసింది.  
Advertisement
Pushpa
pushpa2
Allu Arjun
Pushpa2Reloaded
Sukumar
Pushpa2TheRule
Rashmika Mandanna

More Telugu News