మంగళగిరిలో పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంపై డ్రోన్ కలకలం

  • ఈ మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత ఎగిరిన డ్రోన్
  • వెంటనే అప్రమత్తమైన పవన్ క్యాంపు కార్యాలయ వర్గాలు
  • డీజీపీ, జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సమాచారం అందించిన వైనం
మంగళగిరిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంపై డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. ఈ అనుమానిత డ్రోన్ దాదాపు 20 నిమిషాల పాటు ఎగిరినట్టు గుర్తించారు. ఈ విషయాన్ని పవన్ క్యాంపు కార్యాలయ వర్గాలు తీవ్రంగా పరిగణించాయి. పవన్ భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేశాయి. 

డ్రోన్ ఎగరడంపై పవన్ క్యాంపు కార్యాలయ సిబ్బంది డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ కు, ఎస్పీకి కూడా సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన పోలీసులు... పవన్ క్యాంపు కార్యాలయం సమీపంలోని సీసీటీవీ ఫుటేజిలను పరిశీలిస్తున్నారు. నేటి మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు ఈ డ్రోన్ ఎగరేశారు.


More Telugu News