సుప్రీం కోర్టులో నేడు కేటీఆర్ పిటిషన్‌పై విచారణ
- ఫార్ములా - ఈ కారు రేసింగ్ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్
- పిటిషన్‌పై నేడు విచారించనున్న జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం
- కోర్టు ఉత్తర్వులపై సర్వత్రా ఉత్కంఠ
తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలంటూ కేటీఆర్ తొలుత తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, అందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేశారు. కేటీఆర్ పిటిషన్‌పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
మరోపక్క తెలంగాణ సర్కార్, ఏసీబీ సుప్రీం కోర్టులో ఇప్పటికే కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో సుప్రీంకోర్టులో కేటీఆర్‌కు ఉపశమనం లభిస్తుందా? లేదా? అనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.