రఘురామ చిత్రహింసల కేసు: విజయపాల్ ను ఒంగోలుకు తరలింపు
- గత ప్రభుత్వ హయాంలో రఘురామకు చిత్రహింసలు
- రిటైర్డ్ సీఐడీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్
- ఒక్క రోజు పోలీస్ కస్టడీకి అప్పగించిన గుంటూరు కోర్టు
ఈ నేపథ్యంలో, రిమాండ్ ఖైదీగా ఉన్న విజయ్ పాల్ ను పోలీసులు గుంటూరు నుంచి ఒంగోలుకు తరలించారు. ఈ ఉదయం ఆయనను గుంటూరు జైలు నుంచి తీసుకువచ్చిన ప్రకాశం పోలీసులు... గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం ఒంగోలు తీసుకెళ్లారు. ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో పోలీసులు విజయ్ పాల్ ను 24 గంటల పాటు విచారించనున్నారు.