2007 నాటి కేసులో విజయవాడ కోర్టుకు హాజరైన ఏపీ, తెలంగాణ నేతలు

24-12-2024 Tue 16:53 | Both States
Advertisement
  • ఉమ్మడి ఏపీలో 2007లో ఓబులాపురం మైనింగ్ పరిశీలనకు వెళ్లిన నేతలు
  • కోర్టుకు హాజరైన అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, చినరాజప్ప
  • తెలంగాణ నుంచి నాగం జనార్దన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు హాజరు
  • ఆప్యాయంగా పలకరించుకున్న పాత మిత్రులు
Advertisement
ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు విజయవాడలో కలిశారు! ఉమ్మడి ఏపీలో 2007లో ఓబులాపురం మైనింగ్ పరిశీలనకు వెళ్లిన నేతలపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఈరోజు విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. కోర్టు తదుపరి విచారణను వచ్చే జనవరి 8కి వాయిదా వేసింది.

నాడు 21 మందిపై కేసు నమోదు కాగా, ముగ్గురు విచారణ దశలో మృతి చెందారు. మిగిలిన వారంతా విచారణకు హాజరు కావాలని కోర్టు ఇదివరకే ఆదేశించింది.

దీంతో అభియోగాలు ఎదుర్కొంటున్న ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు నాగం జనార్దన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, చినరాజప్ప, పడాల అరుణ, అమర్నాథ్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, చిన్నం బాబు రమేశ్, కోళ్ల లలిత కుమారి, బొమ్మడి నారాయణరావు, మసాల పద్మజ, పూల నాగరాజు, ముల్లంగి రామకృష్ణారెడ్డి, గురుమూర్తి, మెట్టు గోవింద్ రెడ్డి, యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ న్యాయాధికారి ఎదుట హాజరయ్యారు.

ఇందులో ఎర్రబెల్లి దయాకరరావు, నాగం జనార్దన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి తెలంగాణకు చెందిన వారు. కేసు విచారణలో భాగంగా విజయవాడకు వచ్చిన వారు తమ పాతమిత్రులను ఆప్యాయంగా పలకరించారు.

వీరంతా అప్పుడు టీడీపీలో ఉన్నారు. 2007 జులై 21న అనంతపురం జిల్లా డి.హీరేహల్ మండలంలోని ఓబులాపురం గనుల పరిశీలనకు వెళ్లారు. దీంతో వారిపై నాడు పోలీసు కేసు నమోదైంది. తమపై తప్పుడు కేసు బనాయించారని, తాము ఎక్కడా నేరానికి పాల్పడలేదని న్యాయాధికారి ప్రశ్నలకు వారు వివరణ ఇచ్చారు.
Advertisement
VijayawadaTelanganaTelugudesamAndhra Pradesh

More Telugu News

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27
..more