ఏపీకి మరోమారు భారీ వర్షాల ముప్పు.. బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం!
- ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
- దక్షిణ బంగాళాఖాతంలో నేడు అల్పపీడనంగా మారే అవకాశం
- 12 నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలకు చేరుతుందని అంచనా
- దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు!
దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో 11, 12 తేదీల్లో తమిళనాడులో, 12న దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అంతేకాదు, అల్పపీడనం వాయుగుండంగానూ మారే అవకాశం ఉందన్నారు.