పవన్ మాట సినిమా టైటిల్‌గా.. 'సీజ్ ది షిప్' పేరుతో టైటిల్ రిజిస్టర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పవన్ మాట సినిమా టైటిల్‌గా.. 'సీజ్ ది షిప్' పేరుతో టైటిల్ రిజిస్టర్

Seize The Ship Movie Title Registered
  
ఇటీవ‌ల కాకినాడ పోర్టు నుంచి రేష‌న్ బియ్యాన్ని అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న నౌక‌ను డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌రిశీలించారు. ఆ క్ర‌మంలో ఆయ‌న చేసిన 'సీజ్ ద షిప్' వ్యాఖ్య‌లు నెట్టింట‌ బాగా ప్ర‌చారం అయిన‌ విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా అవే వ్యాఖ్య‌ల‌తో సినిమా టైటిల్ రిజిస్ట్రేష‌న్ కావ‌డం గ‌మ‌నార్హం. తెలుగు ఫిల్మ్ ఛాంబ‌ర్‌ ఆఫ్ కామ‌ర్స్‌లో ఆర్ ఫిల్మ్ ఫ్యాక్ట‌రీ ప్రొడ‌క్ష‌న్స్ అనే సంస్థ సోమ‌వారం ఈ టైటిల్‌ను రిజిస్ట‌ర్ చేయించుకుంది. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది.  

Advertisement
Seize The Ship
Pawan Kalyan
Andhra Pradesh

More Telugu News