వెలగపూడిలో ఐదు ఎకరాలు కొన్న సీఎం చంద్రబాబు
- రాజధాని అమరావతి ప్రాంతంలో ఇంటి స్థలం కొనుగోలు
- ఈ-6 రోడ్డుకు ఆనుకుని ఉన్న 25వేల చదరపు గజాల ప్లాట్ కొన్న బాబు
- ఈ ప్లాట్ పక్కనుంచే కీలకమైన సీడ్ యాక్సెస్ మార్గం
- ఈ ప్లాట్‌కు సమీపంలోనే జడ్జిల బంగ్లాలు, తాత్కాలిక హైకోర్టు, విట్, ఎన్‌జీఓల రెసిడెన్సీలు
దీనికి నాలుగు వైపులా రహదారి ఉంది. అలాగే జడ్జిల బంగ్లాలు, తాత్కాలిక హైకోర్టు, విట్, ఎన్‌జీఓల రెసిడెన్సీలు ఈ ప్లాట్‌కు సమీపంలోనే ఉన్నాయి. అలాగే రాజధానికి కీలకమైన సీడ్ యాక్సెస్ మార్గం కూడా దీని పక్కనుంచే వెళ్తుంది.
ఇది ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు రైతుల పేరిట ఉన్న రిటర్నబుల్ ప్లాట్. ఇప్పటికే ఆ రైతులకు డబ్బులు చెల్లించినట్లు సమాచారం. ఇందులో కొంత స్థలం ఇంటికి, మిగతాది వాహనాల పార్కింగ్, సిబ్బందికి గదులు, లాన్ కోసం వినియోగించనున్నారు. కాగా, చంద్రబాబు గత పదేళ్లుగా కృష్ణా నది ఒడ్డున ఉండవల్లి కరకట్ట మార్గంలోని లింగమనేనికి చెందిన అతిథిగృహంలో ఉంటున్న విషయం తెలిసిందే.