ఏపీలో న్యాయాధికారుల ఉద్యోగ విరమణ వయసు పెంపు... చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం
- ఉద్యోగ విరమణ చట్ట సవరణకు ఆమోదముద్ర వేసిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్
- న్యాయాధికారుల పదవీ విరమణను 60 ఏళ్ల నుంచి 61ఏళ్లకు పెంచుతూ చట్ట సవరణ చేసిన ఏపీ ప్రభుత్వం
- గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించిన న్యాయశాఖ
ఏపీలో జ్యుడీషియల్ అధికారుల పదవీ విరమణ వయసు 60 నుంచి 61 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు క్రమబద్దీకరణ సవరణ బిల్లును ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టగా, శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ తర్వాత శాసనసభ పంపిన బిల్లును యథాతథంగా శాసనమండలి ఆమోదించింది. ఆ తర్వాత గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం రాజ్ భవన్‌కు పంపగా, తాజాగా ఉద్యోగ విరమణ చట్ట సవరణకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదముద్ర వేశారు.