ఇవి వినియోగిస్తే... తెల్ల జుట్టు నల్లబడుతుందట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇవి వినియోగిస్తే... తెల్ల జుట్టు నల్లబడుతుందట!

herbs that can naturally darken grey hair
  • ఇటీవలి కాలంలో చాలా మందికి తెల్ల వెంట్రుకల సమస్య
  • తరచూ కృత్రిమ రంగులు వేసుకుంటున్న కొందరు...
  • దీనితో మరింతగా పెరుగుతున్న ఇబ్బంది
  • పలు సహజ పదార్థాలతో జుత్తును సంరక్షించుకోవచ్చని సూచిస్తున్న నిపుణులు
కాలుష్యం, సరైన పోషకాహారం లేకపోవడం వల్ల ఇటీవలి కాలంలో చాలా మంది జుట్టు చిన్న వయసులోనే తెల్లబడిపోతోంది. చాలా మందిలో వెంట్రుకలు రాలిపోవడం, జుట్టు పలుచబడడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

వెంట్రుకలకు రసాయనాలతో కూడిన రంగులు వేసుకోవడం వల్ల కూడా జుట్టు తెల్లబడటం, రాలిపోవడం పెరుగుతోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కొన్ని సహజ పదార్థాలతో ఈ సమస్య తగ్గుతుందని... జుట్టు తెల్లబడటం ఆగిపోయి, తిరిగి నలుపు సంతరించుకుంటుందని చెబుతున్నారు.

బ్లాక్ టీ...
టీ డికాక్షన్ లేదా బ్లాక్ టీ గోరువెచ్చగా ఉన్నప్పుడు కుదుళ్లకు తగిలేలా రాసుకుని మర్దన చేసుకుంటే ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ టీ లో ఉండే టానిన్స్ వెంట్రుకలు తెల్లబడటాన్ని, రాలిపోవడాన్ని నియంత్రిస్తాయని వివరిస్తున్నారు.

రోజ్ మేరీ...
స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఉత్పత్తులు చాలా వాటిలో రోజ్ మేరీ భాగంగా ఉంటుంది. ఇది వెంట్రుకల కుదుళ్లకు రక్త ప్రసరణను మెరుగుపరిచి, ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. వెంట్రుకలు రంగు మారకుండా చూస్తుంది.

ఆమ్లా (ఉసిరి)...
ఉసిరి కాయల రసాన్ని కుదుళ్లకు తగిలేలా తరచూ మర్దన చేస్తే... వెంట్రుకలు తెల్లబడటం, రాలిపోవడం ఆగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. వెంట్రుకలు బలంగా పెరిగేందుకు, తిరిగి నలుపు రంగులోకి మారేందుకు ఇది తోడ్పడుతుందని వివరిస్తున్నారు.

హెన్నా (గోరింటాకు)...
ఇది చాలా మందికి తెలిసినదే. ఇది వెంట్రుకలు నల్లగా, నిగనిగలాడేలా ఉండేందుకు తోడ్పడుతుంది. అయితే ఇటీవల మార్కెట్లో అమ్మే హెన్నాలలో రసాయనాలు కలిపి వస్తున్నాయి. కాబట్టి సహజమైనది వాడితేనే సరైన ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

మందార తైలం
మందారం కూడా కేశ సంరక్షణలో అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని మందార పూలను నీటిలో రాత్రంతా నానబెట్టి, ఆ నీటిలో కొంచెం కొబ్బరి నూనె కలిపి వెంట్రుకలకు పట్టిస్తే... మంచి నలుపు రంగు సంతరించుకుంటాయని వివరిస్తున్నారు.

సహదేవి మొక్కలు
ఎక్కువ మందికి తెలియని ఆయుర్వేద మూలిక ఇది. దీనిని ఆయుర్వేద నూనెల తయారీలో వినియోగిస్తుంటారు. ఈ మూలిక వెంట్రుకలు తెల్లబడకుండా నివారించడంతోపాటు చుండ్రుపై అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

భృంగరాజ్...
కేశ సంరక్షణకు సంబంధించిన సహజ ఉత్పత్తులు అన్నింటిలో కూడా ఈ ఆయుర్వేద మూలికలను వాడుతారు. సహజమైన భృంగరాజ్ ఉన్న షాంపూ, నూనె వల్ల వెంట్రుకల కుదుళ్లు బలోపేతం అవుతాయి. వెంట్రుకలు నెరిసిపోవడం ఆగిపోతుంది.

కొబ్బరి నూనె...
దీని గురించి చాలా మందికి తెలిసిందే. వెంట్రుకలకు బలాన్ని ఇవ్వడంతోపాటు నలుపు రంగు సంతరించుకునేందుకు కొబ్బరి నూనె దోహదం చేస్తుంది. బాగా ఫిల్టర్ చేసిన నూనెల కన్నా సహజ నూనె వాడితే ఫలితం మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

నువ్వుల నూనె...
పురాతన కాలం నుంచి ఈ నూనెను వాడుతున్నారు. ఇందులో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు వెంట్రుకల కుదుళ్లు బలంగా ఉండటానికి దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. నువ్వుల నూనెను కొంత ఆలివ్ ఆయిల్ తోగానీ, బాదం నూనెతోగానీ కలిపి వాడితే మరింత ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.
Advertisement
Hair care
Health
offbeat
science
Viral News
Hair

More Telugu News