రాజకీయాల‌కు బ్రేక్‌.. వైర‌ల్ అవుతున్న కేటీఆర్ ట్వీట్‌!

రాజకీయాల‌కు బ్రేక్‌.. వైర‌ల్ అవుతున్న కేటీఆర్ ట్వీట్‌!

BRS Working President KTR Tweet goes Viral on Social Media
      
బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ రాజకీయాల‌కు బ్రేక్ అంటూ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే, పూర్తిగా బ్రేక్ కాదులేండి.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటున్న‌ట్టు కేటీఆర్ తెలిపారు.

తాను రిఫ్రెష్ అవ్వాల‌నుకుంటున్నాన‌ని, అందుకే కొన్ని రోజుల పాటు ఈ రాజ‌కీయ‌ కార్య‌క్ర‌మాల‌న్నింటికీ దూరంగా ఉండాల‌నుకుంటున్న‌ట్లు కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే,  తాను పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా లేను క‌దా అని త‌న‌ రాజకీయ ప్రత్యర్థులు త‌న‌ను ఎక్కువగా మిస్స‌వ్వ‌ర‌ని అనుకుంటున్నానంటూ కేటీఆర్ చ‌మ‌త్క‌రించారు. 

ఈ ట్వీట్‌కు ఓ స్మ‌యిలింగ్ ఎమోజీని కూడా జోడించారు. ప్ర‌స్తుతం కేటీఆర్ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌గా, దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు త‌మ‌దైనశైలిలో స్పందిస్తున్నాయి.
Advertisement
KTR
BRS
Telangana

More Telugu News