2024లో అత్య‌ధిక ప‌న్ను చెల్లించిన సెల‌బ్రిటీలు వీరే.. టాప్‌లో ఎవ‌రంటే..!
Add ap7am to your home Screen

2024లో అత్య‌ధిక ప‌న్ను చెల్లించిన సెల‌బ్రిటీలు వీరే.. టాప్‌లో ఎవ‌రంటే..!

Shah Rukh Khan Tops Celebrity Taxpayers List
  • అగ్ర‌స్థానంలో షారుఖ్ ఖాన్‌
  • 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను రూ. 92 కోట్లు ట్యాక్స్ క‌ట్టిన షారుఖ్‌
  • త‌ర్వాతి స్థానంలో ద‌ళ‌ప‌తి విజయ్ (రూ. 80కోట్లు) 
  • మూడో స్థానంలో స‌ల్మాన్ ఖాన్ (రూ. 75 కోట్లు)
2023-24 ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను అత్య‌ధిక ముందస్తు ప‌న్ను చెల్లించిన సెల‌బ్రిటీల్లో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ అగ్ర‌స్థానంలో నిలిచారు. గ‌తేడాది పఠాన్‌, జ‌వాన్ వంటి వ‌రుసగా వెయ్యి కోట్ల సినిమాల‌తో కింగ్ ఖాన్ అల‌రించారు. దీంతో ఆయ‌న రూ. 92 కోట్లు ట్యాక్స్ రూపంలో ప్ర‌భుత్వానికి చెల్లించారు. 

ఆయ‌న త‌ర్వాతి స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజయ్ ఉన్నారు. ఈయ‌న న‌టించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT)  మూవీ రూ. 600కోట్ల‌కు పైగా కొల్ల‌గొట్టిన విష‌యం తెలిసిందే. విజ‌య్ రూ. 80 కోట్లు ప‌న్ను చెల్లించ‌డం జ‌రిగింది. అలాగే బాలీవుడ్ నటుడు స‌ల్మాన్ ఖాన్ రూ. 75 కోట్లు ట్యాక్స్ క‌ట్టారు. 

వారి త‌ర్వాత స్థానంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ (రూ. 71కోట్లు), టీమిండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ (రూ. 66కోట్లు) ఉన్నారు. ఇక మ‌హిళా సెల‌బ్రిటీల్లో క‌రీనా క‌పూర్ రూ. 10 కోట్లతో టాప్‌లో ఉన్నారు. స్టార్లు చేసిన ముంద‌స్తు ప‌న్ను చెల్లింపుల ఆధారంగా ఫార్చ్యూన్ ఇండియా ఈ గ‌ణాంకాల‌ను వెల్ల‌డించింది.    
Advertisement
Celebrity Taxpayers List
Shah Rukh Khan
Thalapathy Vijay
Salman Khan

More Telugu News