రాష్ట్ర గవర్నర్ ను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు
- ఏపీకి వచ్చిన మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
- కోవింద్ గౌరవార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చంద్రబాబు హాజరు
- కోవింద్, గవర్నర్, చంద్రబాబు మధ్య గంటపాటు భేటీ
భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రెండ్రోజుల పర్యటన నిమిత్తం నిన్న విజయవాడ వచ్చారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అధికారిక బంగ్లాలో కోవింద్ బస చేయనున్నారు. రేపు (శనివారం) కేఎల్ యూనివర్సిటీలో జరిగే స్నాతకోత్సవంలో కోవింద్ పాల్గొంటారు.
