ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ మరో పిటిషన్
- తాను పెట్టిన ఒక పోస్టుపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెడుతున్నారన్న వర్మ
- ఒక విషయంపై ఇన్ని కేసులు పెట్టడం సమంజసం కాదని పిటిషన్
- ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్న వర్మ
మరోవైపు వర్మ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో నిన్న విచారణ జరగాల్సి ఉంది. అయితే, ఆ పిటిషన్ విచారణకు రాలేదు. ఈరోజు వర్మ పిటిషన్ పై విచారణ జరిగే అవకాశం ఉంది. వర్మ కోసం పోలీసు బృందాలు గాలిస్తూనే ఉన్నాయి. విచారణకు హాజరుకాకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వర్మపై పోలీసులు ఆగ్రహంతో ఉన్నారు.