సినిమాకు మించి! పెళ్లి కోసం ఊరేగింపుగా గుర్రంపై వెళ్తున్న పెళ్లి కొడుకు.. మెడలోని నోట్ల దండను కాజేసి ట్రక్ డ్రైవర్ పరార్.. తర్వాత ఊహించని ఘటన.. వీడియో ఇదిగో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమాకు మించి! పెళ్లి కోసం ఊరేగింపుగా గుర్రంపై వెళ్తున్న పెళ్లి కొడుకు.. మెడలోని నోట్ల దండను కాజేసి ట్రక్ డ్రైవర్ పరార్.. తర్వాత ఊహించని ఘటన.. వీడియో ఇదిగో!

Viral Video Groom Ditches Wedding Chases Down Man Who Stole His Cash Garland
  • గుర్రం దిగి బైక్‌పై ట్రక్‌ను వెంబడించిన పెళ్లి కొడుకు
  • నడుస్తున్న ట్రక్‌పైకి ఎగబాకి ఆపై లోపలికి దూరి డ్రైవర్‌ను పట్టుకున్న వరుడు
  • అందరూ కలిసి డ్రైవర్‌ను చితకబాదిన వైనం
  • ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఘటన
మరికాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి కొడుకు ఉత్సాహంగా గుర్రమెక్కి ఊరేగింపుగా వివాహ వేదిక వద్దకు బయలుదేరాడు. స్నేహితులు, బంధువులతో కలిసి వెళ్తున్న అతడి మెడలోని కరెన్సీ దండను అటుగా మినీ ట్రక్‌లో వెళ్తున్న డ్రైవర్ కాజేశాడు. వెంటనే అప్రమత్తమైన వరుడు పెళ్లి మండపానికి వెళ్లడానికి బదులు నగదు దండను చోరీ చేసిన డ్రైవర్‌ను పట్టుకునేందుకు బయలుదేరాడు. 

పెళ్లిని పక్కన పెట్టి గుర్రం దిగి పక్కనే ఉన్న వ్యక్తి బైక్ తీసుకుని హైవేపై ట్రక్‌ను వెంబడించాడు. ట్రక్ చేతికి అందాక బైక్‌ను వదిలి సినిమాల్లో చూపించినట్టుగా ట్రక్ పైకి ఎగబాకాడు. జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆపై విండో లోంచి లోపలికి ప్రవేశించాడు. అనంతరం డబ్బుల దండను పట్టుకుని వాహనం దిగిన పెళ్లి కొడుకు డ్రైవర్‌ను కిందికి దింపి చితకబాదాడు. ఈ క్రమంలో అతడిని వెంబడిస్తూ వచ్చిన పెళ్లి కొడుకు స్నేహితులు కూడా తలా ఓ చేయి వేశారు. అంతేకాదు, దారిన పోయే వారు కూడా డ్రైవర్‌పై ప్రతాపం చూపారు. వారి దెబ్బలకు తాళలేక తనను వదిలిపెట్టాలని డ్రైవర్ వేడుకున్నాడు. డబ్బుల దండను దొంగిలించాలన్నది తన ఉద్దేశం కాదని, పొరపాటున అలా జరిగిపోయిందని చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ వారి చేతిలో అతడికి చావు దెబ్బలు తప్పలేదు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పెళ్లి కొడుకు చేజ్ చేసిన తీరు, అతడి ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Advertisement
Viral Video
Groom
Money Garland

More Telugu News