ఓలా స్కూటర్ రిపేరుకు రూ.90 వేలు... కోపం రాకుండా ఎలా ఉంటుంది?
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- పెద్ద సుత్తితో కసిదీరా ఓలా స్కూటర్ ను ముక్కలు చేసిన వ్యక్తి
- ఇటీవల కాలంలో తరచుగా ఓలా స్కూటర్లలో లోపాలు!
చివరికి స్టాక్ మార్కెట్లో కూడా ఓలా షేర్లు పతనమయ్యే పరిస్థితి వచ్చింది. ఇక అసలు విషయానికొస్తే... సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పెద్ద సుత్తి పట్టుకుని ఓలా స్కూటర్ ను కసిదీరా బాదుతుండడం ఆ వీడియోలో చూడొచ్చు. చుట్టూ జనాలు గుమికూడి ఆసక్తిగా తిలకిస్తుండగా... ఆ వ్యక్తి ఓలా స్కూటర్ ను ముక్కలు ముక్కలు చేశాడు. అతడి ఆగ్రహానికి కారణం.... ఆ ఓలా స్కూటర్ రిపేరుకు రూ.90 వేలు ఖర్చవడమే కారణమట!
కాగా, నెటిజన్లు ఈ వీడియోకు ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ ను ట్యాగ్ చేస్తూ నెట్టింట షేర్ చేస్తున్నారు.