రాజకీయాల్లో కూడా ఆయన పవర్ స్టారే: నాని

  • రానా హోస్ట్ చేస్తున్న షోకు హాజరైన నాని
  • సినీ, రాజకీయాల్లో ఎంతో మందికి పవన్ స్ఫూర్తి అన్న నాని
  • పవన్ నిజమైన సూపర్ స్టార్ అన్న రానా
సినీ నటుడు రానా హోస్ట్ చేస్తున్న 'ది రానా దగ్గుబాటి షో'కు నేచురల్ స్టార్ నాని హాజరయ్యారు. ఈ షోలో రానా అడిగిన పలు ప్రశ్నలకు నాని సమాధానాలిచ్చారు. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై నాని ప్రశంసలు గుప్పించారు. 

పవన్ కల్యాణ్ సినీ రంగంలో పవర్ స్టార్ గా ఎలా ఎదిగారో అందరికీ తెలిసిందేనని నాని చెప్పారు. రాజకీయాల్లో సైతం ఆయన అదే స్థాయిలో ఎదిగారని కొనియాడారు. పాలిటిక్స్ లో కూడా పవన్ కల్యాణ్ పవర్ స్టారే అని చెప్పారు. ఇటు సినీ రంగంలో, అటు రాజకీయ రంగంలో పవన్ ఎంతో మందికి స్ఫూర్తి అని తెలిపారు. మరోవైపు గత ఎన్నికల సమయంలో పవన్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఆయనపై తనకున్న అభిమానాన్ని నాని చాటుకున్నారు.

నాని చేసిన వ్యాఖ్యలపై రానా స్పందిస్తూ... పవన్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారని చెప్పారు. పవన్ నిజమైన సూపర్ స్టార్ అని చెప్పారు. ఈ షో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. 

Nani
Rana Daggubati
Pawan Kalyan
Janasena
Tollywood

More Telugu News