నాగ‌చైత‌న్య బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. 'తండేల్' నుంచి కొత్త పోస్ట‌ర్ విడుద‌ల‌
Add ap7am to your home Screen

నాగ‌చైత‌న్య బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. 'తండేల్' నుంచి కొత్త పోస్ట‌ర్ విడుద‌ల‌

Naga Chaitanya Brithday Special New Poster from Thandel Movie
  • నేడు అక్కినేని నాగ‌చైత‌న్య పుట్టిన‌రోజు
  • చైతూ హీరోగా, చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న 'తండేల్'
  • మూవీ నుంచి నాగ‌చైత‌న్య‌ ర‌గ‌డ్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన మేక‌ర్స్‌
అక్కినేని నాగచైతన్య, చందూ మొండేటి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తాజాగా చిత్రం 'తండేల్‌'. ఈరోజు చైతూ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మేక‌ర్స్ తాజాగా మూవీ నుంచి కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో నాగ‌చైత‌న్య ర‌గ‌డ్‌ లుక్‌లో క‌నిపించారు. చూడ‌గానే ఆక‌ట్టుకునేలా మేక‌ర్స్ ఈ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను డిజైన్ చేశారు. 

ఇక ఈ భారీ ప్రాజెక్ట్ లో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండ‌గా, రాక్‌స్టార్ దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 వారు భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ల‌వ్ అండ్ యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న 'తండేల్' మూవీ 2025 ఫిబ్ర‌వ‌రి 7న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.
Advertisement
Naga Chaitanya
Thandel Movie
Tollywood

More Telugu News