Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారత్ తో మ్యాచ్ కోసం పాక్ బౌలర్లకు అక్తర్ సలహాలు

భారత్ తో మ్యాచ్ కోసం అప్పుడే దాయాదులు ఆయుధాలకు పదును పెడుతున్నారు. చాంపియన్స్ ట్రోఫీలో ఒకే గ్రూప్ లో ఉన్న భారత్, పాకిస్తాన్ జట్లు ఈ నెల 15న కార్డిఫ్ వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. కాగా, తమ జట్టు బౌలర్లకు కిటుకులు నూరిపోస్తున్నాడు పాక్ మాజీ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్. వికెట్లు తీయడంపైనే దృష్టిపెట్టాలని సూచిస్తున్నాడు. పరుగులివ్వకుండా పిసినారితనం ప్రదర్శించడంపై ఆసక్తి చూపితే.. భారత బ్యాట్స్ మెన్ ఎదురుదాడికి దిగుతారని హెచ్చరించాడు. అందుకే, కాస్త దూకుడుగా వికెట్ల సాధన కోసమే బంతులు విసరాలని సలహా ఇచ్చాడు. మరి ఈ సూపర్ పేసర్ సలహాలు ఫలిస్తాయో లేదో చూడాలంటే మరో వారం ఆగాల్సిందే.

More Telugu News