'ప్రభాస్ తో అఫైర్' ప్రచారంపై మరోసారి క్లారిటీ ఇచ్చిన షర్మిల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ప్రభాస్ తో అఫైర్' ప్రచారంపై మరోసారి క్లారిటీ ఇచ్చిన షర్మిల

YS Sharmila Clarity About Affair With Actor Prabhas
  • అప్పుడు తన పిల్లలపై ఒట్టు వేసి చెప్పానని గుర్తుచేసిన కాంగ్రెస్ ఏపీ చీఫ్
  • చెల్లెలిపై ప్రేమ ఉంటే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఏంచేశారని జగన్ కు ప్రశ్న
  • చివరకు తనపై దుష్ప్రచారం చేసిన వీడియోను కూడా జగన్ వాడుకున్నారని ఆవేదన
టాలీవుడ్ హీరో ప్రభాస్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి స్పష్టం చేశారు. ఆయనతో తనకు సంబంధం ఉందంటూ అప్పట్లో ప్రచారం జరిగితే తన పిల్లలపై ఒట్టు వేసి చెప్పానని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా ఇదే చెబుతున్నానని వివరించారు. తనపై ఈ దుష్ర్పచారం చేసిన వీడియోలు హీరో బాలకృష్ణ బిల్డింగ్ నుంచే సోషల్ మీడియాలో అప్ లోడ్ అయినట్లు గతంలో జగన్ ఆరోపించారని గుర్తుచేశారు. మరి చెల్లెలిపై ప్రేమ ఉంటే ఐదేళ్లు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఏం చర్యలు తీసుకున్నారని జగన్ ను షర్మిల నిలదీశారు.

తనపై దుష్రచారం జరిగిందని, అది బాలకృష్ణ ఇంటి నుంచే జరిగిందని తెలిసిన తర్వాత ఆయన ఏం చేశారని ప్రశ్నించారు. అధికారం చేతిలో ఉన్నప్పటికీ బాలకృష్ణపై విచారణ ఎందుకు జరిపించలేదని షర్మిల అన్నారు. చివరకు తన సొంత చెల్లెలిపై దుష్ర్పచారం చేస్తున్న వీడియో కూడా తన ప్రయోజనాల కోసం వాడుకున్నాడంటూ జగన్ పై షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈమేరకు హైదరాబాద్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు.


Advertisement
YS Sharmila
Prabhas
Viral Videos
Sharmila Affair

More Telugu News