Vamsi: భానుప్రియను చూసి 35 ఏళ్లు అవుతోంది: డైరెక్టర్ వంశీ!

Vamsi Interview
షార్ట్స్‌లో చూడండి
దర్శకుడిగా .. రచయితగా వంశీకి మంచి పేరు ఉంది. ఆయన టేకింగ్ ను ఇష్టపడే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. భానుప్రియను తెరకి పరిచయం చేసింది ఆయనే. వాళ్ల కాంబినేషన్లో వచ్చిన సితార .. అన్వేషణ .. ఆలాపన వంటి సినిమాలను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. తాజాగా 'సాక్షి'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.

కెరియర్ ఆరంభంలో ఏ సినిమా చేస్తే బాగుందనే విషయంలో, భానుప్రియ నా సలహాలు .. సూచనలు అడుగుతూ ఉండేది. మోడ్రన్ గా కనిపించే రోల్స్ రావడం లేదనే అసంతృప్తి ఆమెకి ఉండేది. ఆమెను 'అన్వేషణ' సినిమాలో మోడ్రన్ గా చూపించాను. అప్పటి ఉంచి ఆమెకి ఆ తరహా పాత్రలు కూడా వచ్చాయని చెప్పింది. ఇదంతా ఎప్పుడో జరిగిన మాట. ఆమెను నేను చూడక దాదాపు 35 ఏళ్లు అవుతోంది" అని చెప్పారు. 

"భానుప్రియను మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నారనే ఒక టాక్ నిజమేనంటారా?" అనే ప్రశ్నకు ఆయన పెద్దగా స్పందించలేదు. 'అదంతా గతం .. చాలా ఏళ్ల క్రితం నాటి పాత కథ. ఈ రోజున నాకు ఎవరూ లేరు .. నా వైఫ్ కూడా చనిపోయింది. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఒకరు చెన్నైలో .. మరొకరు హైదరాబాదులో స్థిరపడ్డారు. మొదటి నుంచి కూడా వాళ్లకి సినిమాల పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ లేదు" అని అన్నారు.

Go Back to Shorts
Vamsi
Director
Bhanupriya

More Telugu News