నకిలీ బంగారం తనఖాపెట్టి పనిచేస్తున్న సంస్థనే మోసగించిన ఉద్యోగులు
- విజయవాడ భవానీపురంలోని ఆక్సివా ఫిన్‌వెస్ట్ లిమిటెడ్‌లో ఘటన
- ఖాతాదారులతో కలిసి కుమ్మక్కయిన ఉద్యోగులు
- నకిలీ బంగారం తనఖా పెట్టి రెండు ఖాతాల ద్వారా రూ. 6.76 లక్షల రుణం
- ఆడిట్‌లో మోసం వెలుగులోకి
- నేరం ఒప్పుకుని తిరిగి చెల్లిస్తామని హామీ
- ఆపై ఒక్కొక్కరుగా ఉద్యోగాలు మానేసిన వైనం
- బ్రాంచి మేనేజర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
గంగిరెడ్డి, హిమబిందు, మానస భవానీపురానికి చెందిన ఊటుకూరు అన్నపూర్ణ, కబేళా ప్రాంతానికి చెందిన జలగం ధనలక్ష్మి, కాకునూరుకు చెందిన కొల్లి కృష్ణవేణితో కలిసి నకిలీ బంగారం తనఖా పెట్టి ఒక ఖాతాలో రూ. 5,66,118 రుణం తీసుకున్నారు. రాళ్లబండి శివకుమార్, రాము మౌనిక, వన్‌టౌన్‌కు చెందిన శివకుమార్‌మణి కలిసి నకిలీ బంగారం తనఖా పెట్టి మరో ఖాతాలో రూ. 1.10 లక్షలు తీసుకున్నారు.
ఆడిట్‌లో మోసం వెలుగులోకి
ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన ఆడిట్ అధికారులు రికార్డులు తనిఖీ చేయగా మోసం వెలుగుచూసింది. నిందితులను విచారించగా నేరం అంగీకరించారు. డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా ఉద్యోగాలు మానివేశారు. దీంతో బ్రాంచ్ మేనేజర్ షేక్‌లాల్ సాహెబ్ ఫిర్యాదు మేరకు అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులతోపాటు ఖాతాదారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.