Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అచ్చమైన తెలుగందం పేరే... ఆనంది!

Aandhi Special
Advertisement
  • తెలుగు నుంచి ఎదిగిన హీరోయిన్ 
  • తమిళ సినిమాలతో ఫుల్ బిజీ 
  • సెట్స్ పై ఉన్న తాజా చిత్రం 'భైరవం'
  • వచ్చే ఏడాది రిలీజ్ కానున్న సినిమా

Advertisement
తెలుగు నేలపై నుంచి... తెలుగు ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్స్ లో 'ఆనంది' ఒకరు. తెలుగమ్మాయిలు తెలుగులో రాణించలేరు అనే వాదన బలంగా నడుస్తున్న రోజులలో 'బస్టాప్' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. వరంగల్ లో పుట్టిపెరిగిన ఈ బ్యూటీని చూసి మనసు పారేసుకుని కుర్రాళ్లు లేరంటే నమ్మాల్సిందే. 

విశాలమైన కళ్లు... విన్యాసాలు చేసే చూపులు... అల్లరి చేసే అందంతో ఆమె యూత్ ను కట్టిపడేసింది. ఎంత సింపుల్ గా ఉన్నా ఎంతో అందంగా కనిపించే బ్యూటీగా మనసులు దోచుకుంది. మోడ్రన్ డ్రెస్సులోనే కాదు పల్లెకట్టులోను... చీరకట్టులోను గ్లామర్ పరంగా ఆమె మంచి మార్కులు కొట్టేసింది. ఫలితంగా తెలుగులో కంటే తమిళంలో బాగా పాప్యులర్ అయింది. అక్కడి కుర్ర హీరోలందరితో కలిసి ఆడిపాడింది. 

అలాంటి ఆనందికి ఈ మధ్య ఇక్కడి నుంచి బాగానే అవకాశాలు వెళుతున్నాయి. 'జాంబీ రెడ్డి'... 'శ్రీదేవి సోడా సెంటర్' వంటి సినిమాలు ఆమె ఖాతాలో చేరాయి. ఇప్పుడు ఆమె చేతిలో 'భైరవం' సినిమా ఉంది. మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కథానాయకులుగా నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ లో ఆనంది కూడా ఒక నాయికగా చేస్తోంది. 'నీలిమ' అనే పాత్రలో ఆమె కనిపించనుంది. 

ఈ సినిమా నుంచి నిన్న ఆనంది పోస్టర్ ను రిలీజ్ చేశారు. తలస్నానం చేసి... నిండగా చీరకట్టుకుని... తులసి మొక్కకు పూజ చేస్తున్నట్టు ఆమె ఈ పోస్టర్లో కనిపిస్తోంది. అచ్చమైన తెలుగందం... స్వచ్ఛమైన పల్లె అందం ఆమెలో కనిపిస్తోంది. ఈ సినిమా తరువాత ఇక్కడ ఆమె మరింత బిజీ కావడం ఖాయమనిపిస్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
Advertisement
Anandhi
Actress
Bhairavam
Manchu Manoj
Bellamkonda

More Telugu News