ఢిల్లీలో వాయుకాలుష్యం... ప్రైమరీ స్కూళ్లు మూసివేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం!
- స్టేజ్-3 ఆంక్షలు అమలు చేస్తున్నట్లు వెల్లడి
- 5వ తరగతి వరకు స్కూల్స్ మూసివేత
- ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని సీఎం ఆదేశాలు
స్టేజ్-3 ఆంక్షల ప్రకారం అత్యవసరం కాని నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం ఉంటుంది. ఐదో తరగతి వరకు విద్యార్థులకు సెలవులు ఇస్తారు.
ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకరస్థాయికి పెరుగుతోంది. రెండు రోజులుగా వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) దాదాపు 400 దాటుతోంది. వాయు కాలుష్యం కట్టడి చర్యల్లో భాగంగా ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-3ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ తెలిపింది.